: బాల్ ట్యాంపరింగ్ అంశంపై స్పందించిన ఇంగ్లండ్‌ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ అలిస్టెర్‌ కుక్‌


బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇటీవలే ఐసీసీ సౌతాఫ్రికా క్రికెట‌ర్ డుప్లెసిస్‌కు త‌న‌ మ్యాచులో పూర్తిగా ఫీజు కోత విధించిన సంగతి తెలిసిందే. ఆ త‌రువాత ఒక్క‌రోజుకే టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఇటువంటి ఆరోపణలే చేస్తూ ఓ బ్రిటీష్ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్లు బాల్ ట్యాంప‌రింగ్ అంశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్‌ అలిస్టెర్‌ కుక్ స్పందించాడు. ఈ అంశాన్ని నిర్వచనంలో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నాడు. బాల్ ట్యాంప‌రింగ్ అంశంలో మ‌రింత స్ప‌ష్ట‌త ఉండాల‌ని అన్నాడు. ఏది అంగీకార యోగ్యం, ఏది కాదు? అన్న విష‌యాన్ని ఐసీసీ మ‌రింత వివ‌రంగా తేల్చిచెప్పాల‌ని అన్నాడు. క్రికెట‌ర్ గమ్‌, జెల్లీ బీన్స్ లాంటి ప‌దార్థాల‌ను న‌మిలి డ్రింక్స్‌ విరామం సమయంలో ఉమ్మేసి, ఆ తర్వాత తొలి ఓవర్లోనే లాలాజలాన్ని బంతికి రాస్తే ఏం చేస్తారని ప్ర‌శ్నించాడు. క్రికెట‌ర్లు చేసే బాల్ ట్యాంపరింగ్‌ను తేల్చే విషయంలో ఇదో పెద్ద లోపమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News