: ఏపీ సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల ట్రయల్ రన్.. శునకం అడ్డురావడంతో ఢీకొన్న వాహనాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేటలో జనచైతన్య యాత్రలో సీఎం పాల్గొంటారు. అనంతరం కడపలో విద్యార్థులు, డ్వాక్రా మహిళల ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు కడప నుంచి విమానాశ్రయం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో శునకం అడ్డురావడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.