: ప్రధాని మోదీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చిన సీతారాం ఏచూరి
ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సంప్రదాయాలను ప్రధాని పాటించకపోవడం బాధాకరమని చెప్పారు. పార్లమెంటులో కీలక అంశానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభకు రాకుండా చర్చ జరిపే ప్రయత్నం చేయడం శోచనీయమని అభిప్రాయపడ్డారు. ఈ విధానం సరైనది కాదని భావించి, తాను వ్యక్తిగతంగా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చానని ఆయన చెప్పారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి తాను నోటీసిచ్చానని, దానిని అనుమతించేదీ, లేనిది రాజ్యసభ ఛైర్మన్ ఇష్టమని ఆయన చెప్పారు.