: మోదీని విమర్శించాలంటే కాంగ్రెస్ లో చేరండి: శత్రుఘ్న సిన్హాకు మంగళ్ పాండే సూచన
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాకు బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు మంగళ్ పాండే సూచించారు. మోదీ యాప్ ద్వారా పెద్ద నోట్ల రద్దుపై చేపట్టిన సర్వేపై శత్రుఘ్న విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళ్ పాండే మాట్లాడుతూ, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. కాగా, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సిన్హా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నాయకత్వ బాధ్యతల నుంచి ఆయనను దూరంగా ఉంచడంపై ఆగ్రహంతోనే ఆయన విమర్శలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.