: నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం: రాహుల్ గాంధీ


పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు అంశం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియకపోయినా... మోదీ సన్నిహితులందరికీ తెలుసని విమర్శించారు. దేశ చరిత్రలో నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద కుంభకోణమని మండిపడ్డారు. మరో కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ, డబ్బు తీసుకునే క్రమంలో క్యూలైన్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని... వీరి సంఖ్య ఉరీ టెర్రరిస్టు దాడిలో చనిపోయిన వారి సంఖ్య కన్నా ఎక్కువగా ఉందని విమర్శించారు.

  • Loading...

More Telugu News