: ఈ గ్రామం రెండేళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది: సచిన్ టెండూల్కర్
టీమిండియా మాజీ ఆటగాడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. సదరు గ్రామం రెండేళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కొనియాడారు. గ్రామాభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ ఆ గ్రామానికి వచ్చి అభివృద్ధి పనుల గురించి తెలుసుకుంటానని చెప్పారు. అలాగే నెల్లూరులోని మరో గ్రామం గొల్లపల్లిలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ నిధుల నుంచి 90 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు చెప్పారు. పుట్టంరాజు కండ్రిగలో యువకులకు సచిన్ క్రికెట్ కిట్లను ఇచ్చారు. అనంతరం మహేశ్ అనే యువకుడి ఇంట్లో టీ తాగారు.