: నల్లధనమే దేశాన్ని కాపాడింది: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు


నల్లధనమే దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండో-మయన్మార్‌-థాయిలాండ్‌ స్నేహపూర్వక కారు ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నల్లధనానికి తాను వ్యతిరేకమని అన్నారు. తనకు నల్లధనం వద్దని చెప్పారు. అయితే దేశంలో ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఉన్న నల్లధనమే మన దేశాన్ని ఆర్థిక మాంద్యంలోనూ తట్టుకోగలిగేలా చేసిందని ఎందరో ఆర్థికవేత్తలు చెబుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే మనదేశాన్ని మాత్రం నల్లధనమే కాపాడిందని ఆయన పేర్కొన్నారు. నల్లధనం నిర్మూలనకు కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కారణంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు మాత్రమే మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినంత మాత్రాన నల్లధనాన్ని నియంత్రించలేమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చర్య సామాన్యుడికి తీవ్ర వేదన మిగిల్చిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News