: జనం రోడ్ల మీద పడ్డారు: అరవింద్ కేజ్రీవాల్
దేశంలో పెద్ద నోట్ల రద్దు అంశం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాటించిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజు ఆయన తమ రాష్ట్ర విధానసభలో పెద్దనోట్ల రద్దు విషయంపై ప్రసంగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం రోడ్ల మీద పడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ శిక్ష నల్లధనం ఉన్న పెద్దలకు కాదని, పేదలకేనని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతూ తాము రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నట్లు వెల్లడించారు.