: 'వరల్డ్ రికార్డ్' అని చెప్పే సమయంలోనే రూబిక్స్ క్యూబ్ సాల్వ్
రూబిక్స్ క్యూబ్... గంటల నుంచి రోజుల తరబడి కూర్చున్నా సాధించలేని పజిల్. దీన్ని కేవలం 0.517 సెకన్లలో ఓ రోబో సాధించింది. అంటే ఒక సెకనులో పదింట ఆరో వంతు వ్యవధిలో ఓ రోబో జర్మనీలోని మ్యూనిచ్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ట్రేడ్ ఫెయిర్ లో ఈ రికార్డును సాధించింది. 'వరల్డ్ రికార్డ్' అని నోటితో చెప్పేంత సమయంకన్నా తక్కువ సమయంలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ కావడం గమనార్హం. కాగా, 2015లో లూకాస్ ఎట్టర్, తన 14వ ఏట 4.904 సెకన్లలో రూబిక్స్ ను సాల్వ్ చేసి చూపగా, అదే మానవ రికార్డుగా ఉంది. మ్యూనిచ్ ప్రదర్శనకు ముందు కొన్ని రోబోలు 1 సెకను వ్యవధిలో రూబిక్స్ ను సరిగ్గా అమర్చాయి. కానీ అంతకన్నా తక్కువ సమయంలో పజిల్ పూర్తి చేయడం ఇదే తొలిసారని బీబీసీ తెలిపింది.