: ఏటీఎంల వద్ద ఆందోళన చేస్తే కఠిన చర్యలు: విజయవాడ పోలీస్ కమిషనర్
ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టరాదని... తమ మాటను కాదని ఆందోళనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయపక్షాలకు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు ఆయన నగరంలోని ఏటీఎం సెంటర్ల వద్ద నెలకొన్న పరిస్థితిని పరిశీలించారు. అనంతరం, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద విపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో, పోలీస్ కమిషనర్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.