: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతిక దారంతో కట్టేశారు!: పరిపూర్ణానంద స్వామి


తెలంగాణ కళా భారతీ (ఇందిరాపార్క్) స్టేడియంలో భక్తి టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి చట్కారంతో కూడిన ప్రసంగం చేశారు. కోటి దీపోత్సవంలో పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతిక దారంతో కట్టేశారని అన్నారు. బోనాలు, సమ్మక్కసారక్క, బతుకమ్మ పండగలను రాష్ట్ర ప్రభుత్వ పండగలుగా చేసిన ఘనత కేసీఆర్ కు మాత్రమే చెల్లిందని అన్నారు. గత ఐదేళ్లుగా అద్భుతమైన రీతిలో కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి అభినందనీయులని అన్నారు. నిన్న ఈ పూజల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉత్సవాలను తమ రాష్ట్రంలో కూడా పెట్టాలని కోరారని ఆయన తెలిపారు. 15 రోజులు తెలంగాణలో, మరో 15 రోజులు ఏపీలో కోటి దీపోత్సవాన్ని మహానుభావుడు చౌదరిగారు ఎలా చేస్తారో చూడాలని ఆయన అన్నారు. కార్యక్రమం ముగియగానే కేసీఆర్ దంపతులు పరిపూర్ణానందకు పాదాభివందనం చేశారు .

  • Loading...

More Telugu News