: 900 మెట్రిక్ టన్నుల ఉప్పు ఉంది.. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు: మంత్రి ఈటల రాజేందర్
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఉప్పు కొరత ఏర్పడిందని, ధర విపరీతంగా పెరిగిపోతుందని వ్యాపారులు పలువురు వదంతులు సృష్టించి లాభం పొందుతున్న అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో భేటీ అయిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఉప్పు విషయంలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పుష్కలంగా ఉప్పు ఉందని, మొత్తం 900 మెట్రిక్ టన్నుల ఉప్పు అందుబాటులో ఉందని చెప్పారు. నిత్యావసర సరుకులను నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.