: డ్రాగా ముగిసిన భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచు


గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో భార‌త్‌- ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన మొద‌టి టెస్టు మ్యాచు డ్రాగా ముగిసింది. ఈ రోజు ఇంగ్లండ్‌ 260/3 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విష‌యం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఈ రోజు ఆరు వికెట్ల‌ను స‌మ‌ర్పించుకుంది. ఆట ముగిసే సమయానికి 172 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌లో విజ‌య్ 31, గంభీర్ 0, పుజారా 18, కోహ్లీ 49 నాటౌట్‌, ర‌హానే 1, అశ్విన్ 32, సాహా 9, జ‌డేజా 32 (నాటౌట్‌) ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్ కి మూడు వికెట్లు ద‌క్క‌గా అలీ, వోక్స్‌, అన్సారీలకు చెరో వికెట్ ద‌క్కింది. ఇంగ్లండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్ లో 537 పరుగులు చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 260/3 కు డిక్లేర్ చేసింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 488 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 172 (52.3ఓవర్లకి) పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News