: సదాశివపేట ఎస్బీఐ లో భారీ దోపిడీ... పోయింది కొత్త కరెన్సీనా? లేక పాత నోట్లా?


సంగారెడ్డి జిల్లా సదాశివపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకు షట్టర్లు పగులగొట్టిన దోపిడీ దొంగలు భారీ ఎత్తున నగదు చోరీ చేసి తీసుకెళ్లినట్టు సమాచారం. ఉదయాన్నే బ్యాంకును తెరిచేందుకు వచ్చిన అధికారులు షట్టర్ తాళం పగులగొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, బ్యాంకులో పాత, కొత్త కరెన్సీ నోట్లు ఉన్నాయని, దొంగలు ఏ కరెన్సీని, ఎంత తీసుకువెళ్లారన్నది పరిశీలన తరువాత చెప్పగలమని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News