: ‘గురు’ చిత్రం షూటింగ్.. రాయల్ ఎన్ ఫీల్డ్ పై వెంకటేష్


ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘గురు’లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ విశాఖపట్టణం జిల్లాలోని భీమిలిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇక్కడి బీచ్ రోడ్డులోని బోయవీధి సమీపంలో కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై వెంకటేష్ వస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. క్యాప్, స్పెట్స్, పొడుగాటి పెద్ద బ్యాగ్ తగిలించుకుని వెంకటేష్ మోడ్రన్ లుక్ తో వున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News