: శ్మశానం విషయమై రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్త పరిస్థితులు, పోలీసుల లాఠీఛార్జి
శ్మశానం విషయమై రెండు గ్రామాల మధ్య వివాదం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ విషయమై నాగాయలంక, రేమాలవారిపాలెం గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. శ్మశాన స్థలం అంశం కోర్టులో ఉన్నందున రేమాలవారిపాలెంకు చెందిన మృతదేహాన్ని ఆ శ్మశానంలో దహనం చేసేందుకు నాగాయలంక వాసులు నిరాకరించారు. దీంతో, రహదారిపైనే ఆ మృతదేహాన్ని ఉంచి రేమాలవారిపాలెం వాసులు ఆందోళనకు దిగారు.