: కొండచిలువ పొట్టలో వంద గుడ్లు!
నైజీరియాలోని ఓ గ్రామంలో తమ దూడలు కనిపించకుండా పోతున్నాయని ఆందోళన చెందిన గ్రామస్తులు అందుకు కారణం కొండచిలువ వాటిని తినేయడమేనని అనుమానించి, దానిని పట్టుకుని చంపేశారు. ఆ తర్వాత దాని పొట్ట కోసి చూసి షాక్కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే తాము పెంచుకుంటున్న దూడలు అదృశ్యమైపోతుండడాన్ని గమనించిన గ్రామస్తులకు ఇటీవలే ఓ కొండచిలువ కనిపించింది. అది బాగా బలిసినట్లు ఉండడంతో తమ దూడలను అదే తినేస్తోందని అనుమానించారు. దీంతో దాన్ని చాకచక్యంగా పట్టుకొని చంపేశారు. అనంతరం దాని పొట్టను కోసి చూస్తే.. వారికి అందులో సుమారు వంద గుడ్లు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.