: లంచానికి వంద నోట్లే కావాలని పట్టుబట్టాడు... విసిగిపోయి ఏసీబీకి ఫోన్ చేశారు
పాత రూ. 500, రూ. 1000 రద్దు కావడంతో... మనం ఎన్నడూ చూడని విచిత్రాలు జరుగుతున్నాయి. పెద్ద నోట్లు ఎలాగూ చలామణిలో లేవు... కనీసం లంచం ఇవ్వడానికైనా పనికొస్తాయని భావించిన వారికి చుక్కెదురైంది. తనకు పెద్ద నోట్లు వద్దని... కేవలం రూ. 100 నోట్లే కావాలని ఓ లంచావతారం (ప్రభుత్వోద్యోగి) పట్టుబట్టాడు. తమ వద్ద ఈ నోట్లే ఉన్నయి సార్... ప్లీజ్ తీసుకోండి అంటూ భాధితులు చాలా పధ్ధతిగా లంచం ఇవ్వబోయారు. పెద్ద నోట్లు తీసుకోవడం కుదరదంటూ ఉద్యోగి తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన వాళ్లు... ఇక లాభం లేదనుకుని డైరెక్ట్ గా ఏసీబీ అధికారులకు ఫోన్ చేశారు. దీంతో, లంచావతారం అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మోహోల్ పంచాయతీలో జరిగింది. బాలాసాహెబ్ భికాజీ అనే వ్యక్తి అక్కడ వ్యవసాయాధికారిగా పని చేస్తున్నాడు. రూ. 2,500 లంచాన్ని వంద రూపాయల్లోనే ఇవ్వాలంటూ వేధిస్తున్న సమయంలో, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.