: 2000 రూపాయల నోటులోని విశేషాలు ఇవే!
కొత్తగా విడుదల చేసిన 2000 వేల రూపాయల నోటుకు సంబంధించిన విశేషాలు. పింక్ కలర్ లో ఉన్న 2000 రూపాయల కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మతో పాటు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, ముద్రణ సంవత్సరం 2016 కూడా ముద్రించి ఉంటుంది. ఇస్రో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక గ్రహాంతర వ్యోమనౌక యాత్రకు గుర్తుగా మంగల్యాణ్ బొమ్మను కూడా నోటుపై ముద్రించారు. ఈ నోటులో ఉండే కొన్ని విశిష్ట లక్షణాలు... 2000 రూపాయల నోటు ముందువైపు... * 2000 అని అంకెల్లో రాసిన దానికింద రిజిస్టర్ నంబర్ ఉంటుంది. * 2000 ఇమేజ్ కాస్త గుప్తంగా తరచిచూస్తే కనిపించే విధంగా ఉంటుంది. * దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది. * నోటు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. * బ్యాంకు నోటు ఎడుమవైపు ‘ఆర్బీఐ’ అని, ‘2000’ అని సూక్ష్మంగా రాసి ఉంటుంది. * ‘భారత్’ అని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ లో రాసి ఉంటుంది. అంతేకాకుండా ఆర్బీఐ, 2000 అని, కలర్ షిఫ్ట్ లో రాసి ఉంటాయి. నోటును కాస్త కదిలిస్తే ఇవి ఆకుపచ్చని రంగు నుంచి నీలిరంగులోకి మారతాయి. * నోటు కుడివైపున గ్యాంరెటీ క్లాజ్, గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి. * కుడివైపున కిందిభాగంలో రూపీ ముద్ర, ₹2000 అని కలర్ చేంజింగ్ (ఆకుపచ్చ రంగు నుంచి నీలిరంగులోకి మారుతాయి)లో రాసి ఉంటాయి. * మహాత్మాగాంధీ బొమ్మకు కుడివైపున అశోక స్తంభం చిహ్నంతోపాటు, ఎలక్ట్రోటైప్ (2000 అని) వాటర్ మార్క్స్ ఉంటాయి. ఇక నోటు వెనుక భాగంలో .. *ఎడుమవైపున పైభాగంలో, కుడివైపున కిందిభాగంలో సిరీస్ అంకెలు చిన్నవి నుంచి పెద్దవిగా ఉంటాయి. 2000 నోటు వెనుకవైపు... * ఎడమవైపు ముద్రణ సంవత్సరం ముద్రించి ఉంటుంది * నినాదంతో కూడిన స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది. * కుడివైపునకు చేరువగా భాషల ప్యానెల్ ఉంటుంది. దీనిలో 15 భారతీయ భాషలు ఉంటాయి. * మంగల్యాణ్ బొమ్మ ఉంటుంది. * దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది. * 2000 నోటు 0.66 మిల్లిమీటర్ల వెడల్పు, 166 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. అంధుల కోసం * దృష్టి లోపం వున్న వారు గుర్తించేందుకు మహాత్యాగాంధీ బొమ్మ, అశోక స్తంభం చిహ్నం ఉబ్బెత్తుగా ఉండి, బ్లీడ్ లైన్స్, ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి. * సమాంతరంగా, దీర్ఘచతురస్రాకారంలో ₹2000 ఉబ్బెత్తుగా నోటుపై రాసి ఉంటుంది. * నోటు కుడివైపున, ఎడుమవైపున కోణాకారంలో బ్లీడ్ లైన్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి.