: రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు..రెండురోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు: ప్రధాని
రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేశామని, అదేవిధంగా, రేపు, ఎల్లుండి ఏటీఎంలు పని చేయవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో నల్లధనాన్ని ఊడ్చిపారేసే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తే, మరింత ప్రయోజనం లభిస్తుందని అన్నారు. నల్లధనం, దొంగనోట్లతో ఆటలాడేవారి ఆట కట్టిద్దామని, దుర్మార్గుల చేతుల్లోని రూ.500, రూ.1000 నోట్లు నేటి అర్ధరాత్రి నుంచి చిత్తుకాగితాల్లా మారతాయని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిజాయతీ గల పౌరులకు కొంత అసౌకర్యం కల్గుతుందని మోదీ అన్నారు.