: 'మాస్తీగుడి' దుర్ఘటనపై నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు
'మాస్తీగుడి' సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరు నటులు ఉదయ్, అనిల్ తిప్పనగుండహళ్లి రిజర్వాయర్ లో మునిగి గల్లంతైన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా స్టంట్ మాస్టర్, దర్శకుడు, సినిమా యూనిట్, నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో తమకు ఈతరాదని చెప్పినా యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం, హెలికాప్టర్ నుంచి దూకిన చాలా సేపటి వరకు బోట్లు సంఘటనా స్థలికి చేరకపోవడంతో వారు నీటమునిగిన సంగతి తెలిసిందే.