: ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వానికి యూకే మద్దతు: ప్రధాని మోదీ
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే భారత్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఆమెతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాలదే ముఖ్య పాత్ర అని పేర్కొన్నారు. లండన్‌లో భారత్‌కు చెందిన ఎన్నో సంస్థలు ఉన్నాయని, యూకేతో వాణిజ్య సంబంధాల అభివృద్ధికి జూయింట్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. భారత్-యూకే సాంకేతిక సదస్సును ఈ ఉద్దేశంతోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆ దేశ సంస్థలను కోరారు. ఎన్‌ఎస్‌జీ భారత్‌కి సభ్యత్వం కోసం యూకే మద్దతుగా ఉందని ఆయన పేర్కొన్నారు.