: ఒకేసారి 20 ఉద్యోగాలు చేస్తూ, 67 ఏళ్లకు రిటైర్ మెంట్ తీసుకున్నాడు!


ఒకరు ఒక ఉద్యోగం చేస్తారు. మరికొందరు ఇంకో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. అత్యంత అరుదుగా మూడో పని చేసే వ్యక్తి తారసపడుతుంటాడు. అలాంటిది యూకేలోని నార్త్ రొనాల్డ్ సే దీవిలో బిల్లీ మూర్ అనే వ్యక్తి ఒకటి, రెండు కాదు, ఏకంగా 20 ఉద్యోగాలను ఏళ్ల తరబడి చేస్తూ తన 67 ఏళ్ల వయసులో ఇటీవల రిటైర్ అయ్యాడు. కేవలం 50 మంది నివసించే ఈ దీవిలో ఓ విమానాశ్రయం కూడా ఉంది. టూరిజం, స్థానిక వనరులు ఆదాయంగా ఇక్కడి వారు బతుకుతుంటారు. టూరిస్టు సీజన్ లో పనిచేసే ఓ చిన్న విమానాశ్రయం కూడా ఇక్కడ ఉంది. ఇక బిల్లీమూర్ మామూలుగా అయితే గొర్రెల కాపరి. ఇక విమానాల సీజన్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. అక్కడి లైట్ హౌస్ కి పర్యవేక్షకుడు. దీవిలో ఎలక్ట్రీషియన్, ఫైర్ ఫైటర్, వచ్చే టూరిస్టులకు టూర్ గైడ్, వారికి డ్రైవర్, స్థానికుల ఇళ్ల మరమ్మతులు చేసే కార్పెంటర్... ఇత్యాది 20కి పైగా ఉద్యోగాలు చేస్తూ, కాలం గడిపాడు. ఇప్పుడతని పదవీ విరమణ సందర్భంగా దీవి ప్రజలు బిల్లీ మూర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.

  • Loading...

More Telugu News