: రోడ్డుపైకి వచ్చిన మొసలి పిల్ల... జాగ్రత్తగా పట్టుకొని తిరిగి చెరువులోకి వదిలిన పోలీసులు
ఇటీవల మెక్సికోలో కురిసిన భారీ వర్షాల ధాటికి టంపికో నగరంలో వరదలు వచ్చాయి. దీంతో రోడ్డుపైకి ఓ మొసలి పిల్ల కొట్టుకువచ్చింది. రోడ్డుపక్కనే ఉన్న ఆ మొసలిని ఈ రోజు ఉదయం గుర్తించిన అక్కడి పోలీసులు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని తిరిగి చెరువులో వదిలివేశారు. మొసలిని పోలీసులు పట్టుకుంటున్న సమయంలో అది వారిపైకి ఎగిరే ప్రయత్నం చేసింది. ఓ గొడుగు సాయంతో దాన్ని నొక్కి పట్టుకొని మొసలిని పట్టుకున్నారు. చిన్ని మొసలిని చూసిన స్థానికులు తమ సెల్‌ఫోన్లతో దాని ఫొటోలు, వీడియోలూ తీస్తూ కనిపించారు. పోలీసులు తిరిగి దాన్ని చెరువులో వదిలి వేయడంతో అది ప్రాణాలతో బయటపడింది.