: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు అరుదైన గౌరవం
బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ పర్యాటకానికి భారత ప్రచారకర్తగా ఆయన ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది నుంచి స్విట్జర్లాండ్ టూరిజంకు రణవీర్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా రణవీర్ మాట్లాడుతూ, "గత వేసవిలో స్విట్జర్లాండ్ వెళ్లాను. పారాగ్లైడింగ్, స్కైడైవింగ్ లాంటి సాహసాలు చేశా. స్విస్ లో గడపడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒక అద్భుతమైన దేశం అది. ఇప్పుడు అదే దేశానికి భారత ప్రచారకర్తగా ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా" అని తెలిపాడు.