: 10న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఈ నెల 10వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు నాబార్డు రుణంపై అరుణ్ జైట్లీ, ఉమా భారతితో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) ఆధ్వర్యంలో ఉన్నత విద్యపై జరగనున్న సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.