: వాయుగుండమైన అల్పపీడనం... భారీ వర్ష సూచన


బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, వాయవ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌ తీరంవైపు వెళ్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశాలపై ఎక్కువగా ఉండవచ్చని, తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. సముద్రంలోకి చేపల వేట నిమిత్తం ఎవరూ వెళ్లరాదని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News