: అనుమానాలను పటాపంచలు చేస్తూ, అఖిలేష్ రధయాత్రకు ములాయం సోదరులు
యూపీలో సమాజ్ వాదీ పార్టీలో విభేదాలను తాత్కాలికంగానైనా తండ్రీ కొడుకులు పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో వికాస్ రథయాత్రను అఖిలేష్ నేడు అట్టహాసంగా ప్రారంభించగా, సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ హాజరయ్యారు. వేదికపై ముగ్గురు నేతలూ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కనిపించింది. వీరు స్టేజ్ పైకి వస్తున్న వేళ, కొందరు కార్యకర్తలు ఘర్షణలకు దిగినప్పటికీ, దాన్ని చిన్న ఘటన గానే ములాయం కొట్టి పారేశారు. లక్నోలోని లా మార్టినల్ స్కూల్లో రథయాత్రకు ములాయం స్వయంగా పచ్చజెండా ఊపారు. కాగా, ప్రజల్లో తనకున్న బలాన్ని నిరూపించుకునేందుకు ఈ యాత్రను వాడుకోవాలని అఖిలేష్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.