: అవును.. మాకు భారీ నష్టమే.. త్వరలోనే కోలుకుంటాం.. కోవర్టులను వదిలిపెట్టం: మావోయిస్టు ప్రతినిధి జగన్

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ నష్టమే జరిగిందని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే మళ్లీ కోలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు తమకు కొత్త కాదన్న ఆయన, చనిపోయిన మావోయిస్టుల పేర్లను వెల్లడించారు. ఉద్యమాన్ని ఇక నుంచి ఉరకలెత్తిస్తామని స్పష్టం చేశారు. కోవర్టుకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జగన్ హెచ్చరించారు. ఎన్‌కౌంటర్‌లో 30 మంది మృతి చెందడం 40 ఏళ్ల విప్లవ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఏవోబీలో జరిగింది కోవర్టు ఆపరేషనేనని పేర్కొన్న జగన్, పాలకులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కోవర్టు ఆపరేషన్‌కు నిరసనగా 3వ తేదీ గురువారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

More Telugu News