: లక్షలు పోసి ఐ-ఫోన్ షాపు కొన్నాడు... అందరి ముందూ ధ్వంసం చేశాడు!


చైనాలోని ఓ ఐ ఫోన్ దుకాణం వద్ద ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఐ-ఫోన్‌లో ప్రాబ్లం రావ‌డంతో ఇటీవ‌లే ఐఫోన్‌ స్టోర్‌కి వెళ్లి దాన్ని రిపేర్‌ చేయమ‌ని కోరాడు. అయితే, షాపు యజమాని ఆ ఫోన్‌ని రిపేర్‌ చేయడం కుదరదని చెప్పాడు. డబ్బులుంటే కొత్త ఐఫోన్‌ కొనుక్కోమంటూ ఎగ‌తాళి చేశాడు. దీంతో రిపేర్ చేయించుకోవ‌డం కోసం వచ్చిన వ్య‌క్తికి కోపం ముంచుకొచ్చి, ఎందుకు రిపేర్‌ చేయరని నిల‌దీశాడు. అందుకు య‌జ‌మాని మ‌ళ్లీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఐఫోన్‌ షాపులో ఉన్న ఐఫోన్ల‌న్నింటినీ తాను కొనేస్తాన‌ని అన్నాడు. షాపులోని వారు ఆ వ్య‌క్తి సరదాగా అలా మాట్లాడుతున్నాడ‌ని అనుకున్నారు. కానీ, కోపంతో ఉన్న ఆ వ్య‌క్తి నిజంగానే షాపులో ఉన్న 10 ఐఫోన్లను కొన్నాడు. అనంత‌రం అక్క‌డే ఆ ఫోన్లన్నింటినీ సుత్తితో పగలకొట్టాడు. దీంతో అక్క‌డి వారంద‌రూ షాక్ తిన్నారు. ఈలోగా షాపు య‌జ‌మాని అతనిని మ‌రోసారి ఎగ‌తాళి చేస్తూ రెచ్చగొట్టాడు. '63 వేల యాన్లు(రూ. 6.2లక్షలు) పెట్టి ఐఫోన్ల‌ను కొని ప‌గుల‌కొట్టొచ్చు.. కానీ, నా దుకాణం మొత్తాన్ని ఏమీ చేయ‌లేవు క‌దా?' అన్నాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి షాపు విలువ ఎంతో క‌నుక్కున్నాడు. అనంత‌రం రూ. 50 లక్షలు ఇచ్చి షాపు మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో ఉంది. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన అక్క‌డి వారంతా తీవ్ర ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News