: మహిళల డబుల్స్లో వరుసగా రెండో ఏడాది సానియా మిర్జాకే నెంబర్ వన్ ర్యాంకు


సానియా మీర్జా-మార్టినా హింగిస్ ల జోడీ డబ్ల్యూటీఏ టైటిల్ ను నిలబెట్టుకోవడం కోసం పోరాడి ఓడింది. చైనీస్ తైపేకి చెందిన జోడీ హోచింగ్ చాన్-యంజ్ జాన్ చాన్ లపై గెలిచి ఈ సీజన్‌లో టోర్నీలో సెమీస్ కు వెళ్లిన సానియా-మార్టినా శ‌నివారం ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (ర‌ష్యా జోడీ) చేతిలో ఓట‌మిపాల‌యింది. దీంతో సానియా నెంబ‌ర్‌.1 ర్యాంకును కోల్పోతుంద‌నుకున్నారు. అయినప్ప‌టికీ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో సానియా మీర్జా త‌న వ్య‌క్తిగ‌త‌ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. దీంతో మహిళల డబుల్స్లో వరుసగా రెండో ఏడాది కూడా నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు ఈ హైద‌రాబాదీకే ద‌క్కింది. సెమీస్ లో సానియా జోడీని ఓడించిన రష్యాజోడీ తాజాగా డబ్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను సాధించారు. వీరు కాకుండా బెథానీ-సఫరోవా జోడి ఈ టైటిల్ సాధిస్తే మాత్రం సానియా తన ర్యాంకును కోల్పోవాల్సి వ‌చ్చేది.

  • Loading...

More Telugu News