: షారూక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం: సింగర్ మాళవిక


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని సింగర్ మాళవిక చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను ఏడో తరగతి చదువుకునేటప్పటి నుంచి షారూక్ అభిమానినని, చదువుకునే రోజుల్లో షారూక్ పోస్టర్లు కూడా తన ఇంట్లో ఉండేవని చెప్పింది. ‘గంగోత్రి’ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్న మాళవికకు అక్కినేని నాగార్జున నటించిన ‘రామదాసు’ చిత్రంలో తాను పాడిన ‘ఏటైందే గోదారమ్మ..’ అనే పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.

  • Loading...

More Telugu News