: గవర్నర్, బీసీ కమిషన్ లకు వీహెచ్ లేఖ


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, బీసీ కమిషన్ ఛైర్మన్ లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు లేఖ రాశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన బీసీల వివరాలను బహిర్గతం చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు కేంద్రం ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో సక్రమంగా అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇష్టానుసారం అప్పులు చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని... రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది కట్టిస్తామంటూ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News