: ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి: జైట్లీ సన్మాన కార్యక్రమంలో వెంకయ్య
రాష్ట్రాలు ముందుకు వెళ్లనిదే దేశం ముందుకు వెళ్లబోదని, రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి చేయాలన్నదే కేంద్రం లక్ష్యమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించినందుకు ఈ రోజు విజయవాడలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి బీజేపీ నేతలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ... తాను ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాకపోయినప్పటికీ, రాష్ట్ర విభజన బిల్లు పెట్టకముందు, పెట్టిన తరువాత, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. ఏపీపై ప్రత్యేక దృష్టి, శ్రద్ధ, సాయం ఉన్న వ్యక్తి నరేంద్రమోదీ అని ఆయన అన్నారు. ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని ఆయన అన్నారు. ఏపీకి కేంద్ర సహకారం నిరంతర ప్రక్రియ అని చెప్పారు.