: సిద్ధూ మానవ బాంబులాంటివాడు: పంజాబ్ ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు


మాజీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మానవ బాంబు లాంటి వ్యక్తి అని పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్ లో ఆయన మాట్లాడుతూ, సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనను తాను పేల్చేసుకుంటాడని అన్నారు. సిద్ధూ బీజేపీలో ఉండగా కూడా సుఖ్ బీర్ సింగ్ ఆయనపై విమర్శలు చేసేవారు. సిద్ధూ, బీజేపీ బలపడడాన్ని ఆయన అంగీకరించలేదని పంజాబ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధూ' అంటూ మొదట్లో ప్రచారం జరిగినప్పుడు, తాజాగా కాంగ్రెస్ లో సిద్ధూ చేరుతారని ప్రచారం జరిగిన సందర్భంలోను ఆయనపై ఉపముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాగా, నిన్న సుఖ్ బీర్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News