: రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముగిసిన అఖిలేశ్ భేటీ.. స్పందించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ శ్రీరాం నాయక్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల మధ్య గవర్నర్‌ను అఖిలేశ్ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే, రాజకీయవర్గాల ఊహాగానాలకు అఖిలేశ్ తెరతీశారు. గవర్నర్‌ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ... తాను గవర్నర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై వివరించినట్లు చెప్పారు. గవర్నర్‌తో తేనీటి విందులో మాత్రమే పాల్గొన్నట్లు పేర్కొన్నారు.