: డెబిట్ కార్డుల స్కాం వెనుక పాకిస్థాన్ హస్తం... సర్జికల్ దాడులకు ప్రతీకారం!


ఇండియాలో సంచలనం సృష్టించిన డెబిట్ కార్డుల సమాచార తస్కరణ స్కాం వెనుక పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇండియా జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగానే ఈ పని చేసివుండవచ్చన్న అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. తాము తెలుసుకున్న 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారాన్ని చైనా హ్యాకర్లతో పంచుకున్న పాక్ హ్యాకర్లు కోట్లాది రూపాయలను తమ ఖాతాలకు మళ్లించుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు సైతం ఇది పాక్ సైబర్ నేరగాళ్ల పనేనని అనుమానిస్తున్నాయి. మరోవైపు పాక్ సైబర్ నేరగాళ్లు దశలవారీగా భారత వెబ్ సైట్లపై దాడులు చేస్తూ, 7 వేలకు పైగా వెబ్ సైట్లను హ్యాక్ చేయగా, భారత నిపుణులు వాటిని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హ్యాకింగ్ గురించిన సమాచారం ముందుగానే బ్యాంకులకు తెలిసినా అవి ఫిర్యాదు చేయకపోవడంతో ఈ మొత్తం కుంభకోణంపై అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ విచారణకు సైతం ఆదేశించింది.

  • Loading...

More Telugu News