: మాల్యా విల్లా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదట!...రెండోసారీ వేలం వాయిదా


ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా విల్లాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బ్యాంకులను నిలువునా ముంచి 9 వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, బిచాణా ఎత్తేసిన విజయ్ మాల్యాకు సంబంధించిన గోవాలోని కింగ్ పిషర్ విల్లాను స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియమ్‌ వేలానికి పెట్టింది. గతేడాది కింగ్‌ ఫిషర్‌ విల్లాను స్వాధీనం చేసుకున్న బ్యాంకింగ్ కన్సార్టియం కనీస ధరను 85.29 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. విజయ్‌ మాల్యా విందులు, వినోదాలు, స్పెషల్ పార్టీల కోసం ఉపయోగించే ఈ విల్లాను కొనేందుకు వేలంకు ప్రకటనలు ఇచ్చినా ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. దీంతో ఇబ్బందుల్లో పడ్డ బ్యాంకుల కన్సార్టియం తాజా వేలాన్ని కూడా రద్దు చేసింది.

  • Loading...

More Telugu News