: స్టార్ హోటల్ లో తాగి అద్దాలు పగులగొట్టిన ప్రేమికులు... అరెస్ట్
రాత్రంతా ఫుల్లుగా తాగి, మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థంకాని ప్రేమికులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నయ్ నుంగంబాక్కంలోని ఓ స్టార్ హోటల్ కు దాఖర్ (26) తన ప్రియురాలు జియో జయథాన్ సంగ్ (23)తో కలసి వెళ్లాడు. వీరిది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. హోటల్ లో రాత్రంతా మద్యం తాగుతూనే ఉన్న ఈ జంట తెల్లవారుజామున 3.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరింది. కానీ, ఫుల్ కిక్ లో ఉన్న వీరిద్దరూ హోటల్ ఎంట్రన్స్ వద్ద నిర్మించిన అద్దాలపై పడ్డారు. దీంతో అవి పగిలిపోయాయి. వాటి ఖరీదు రూ. 50 వేలు. దీంతో, జరిగిన నష్టంపై హోటల్ సిబ్బంది వారిని ప్రశ్నించింది. ఈ క్రమంలో, సిబ్బందిపై కూడా వారు దాడికి యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమికుల్ని ప్రశ్నించారు. కానీ, మత్తులో ఉన్న వారి నుంచి వివరాలు కూడా తెలియరాకపోవడంతో... పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.