: రేపు విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విల్లా వేలం


బ్యాంకు రుణాలు చెల్లించలేక విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ విల్లాకు రేపు వేలం పాట నిర్వహించనున్నారు. అత్యంత విలాసవంతమైన పార్టీలను మాల్యా ఈ విల్లాలోనే ఏర్పాటు చేస్తుండేవాడు. గోవాలోని సముద్రం సమీపంలో ఉన్న ఈ విల్లాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 17 మంది రుణ దాతల కన్సార్టియం వేలానికి ఉంచింది. ఈ విల్లా రిజర్వ్ ధర రూ.85.92 కోట్లుగా ప్రకటించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రుణాల కోసం ఈ భవనాన్ని 2010లో బ్యాంకుల కన్సార్టియం వద్ద తనఖా పెట్టారు. మాల్యా ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన మేరకు రికవరీ చేసుకోవాలని బ్యాంకుల కన్సార్టియం చూస్తోంది.

  • Loading...

More Telugu News