: సచివాలయంలో ఏపీ వినియోగిస్తున్న భవనాలను మాకు అప్పగించండి: గవర్నర్ తో కేసీఆర్
హైదరాబాదు సచివాలయంలో ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలను తమకు అప్పగించాలని గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కోరారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను ఈరోజు కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త సచివాలయం నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం. కొత్త జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పరిపాలన విజయవంతంగా సాగుతోందని నరసింహన్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యామ్నాయ భవనాలు కేటాయిస్తామని చెప్పారు.