: స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకున్న జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో జగన్ పాల్గొన్నారు. బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్ద కొనసాగుతున్న రొట్టెల పండుగలో పాల్గొని, రొట్టెలు మార్చుకున్నారు. జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు జగన్‌కి కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.