: కేరళలో బీజేపీ కార్యకర్తల మహార్యాలీ.. సెక్రటేరియట్ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఇటీవల ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్తను దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై ఆగ్రహించిన రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు తిరువనంతపురంలో మహార్యాలీ నిర్వహించారు. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు సెక్రటేరియట్‌కు అడ్డుగా ఉంచిన బారీకేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడే బైఠాయించిన కార్యకర్తలు కార్యకర్త హత్యకు నిరసనగా నినాదాలు చేశారు.