: హైదరాబాదులో దారుణం... కుమార్తెను వేధిస్తున్న తండ్రి


సభ్యసమాజం తల దించుకునే ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. తండ్రి వేధింపులను తట్టుకోలేకపోయిన ఓ బాలిక చివరకు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే, ఫిలింనగర్ లోని ఙ్ఞానిజైల్ సింగ్ నగర్ లో శంకర్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను తన పెద్ద కుమార్తె (16)ని తరచూ వేధిస్తున్నాడు. అంతేకాదు, మత్తులో ఆమెను తిడుతూ, కొడుతూ ఉన్నాడు. అడ్డుకోవడానికి వచ్చిన భార్య, చిన్న కుమార్తెలపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అతడి ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News