: దుర్గామాత ఉత్సవాలకు అతిథులుగా విచ్చేసిన ఎలుగుబంట్లు


సాధారణంగా దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, సెలబ్రిటీలు వస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఎలుగుబంట్లు ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తాయి. దుర్గామాత కొలువుదీరిన ఈ ఆలయం ఛత్తీస్ గఢ్ లోని గుచాపాలిలో ఉంది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన వెంటనే ఎలుగుబంట్లు ఇక్కడకు రావడం ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఆలయం దగ్గరకు ఎలుగుబంట్లు భారీగా వచ్చాయి. వాటికి ప్రసాదాలు పెట్టగానే, ఆరగించి వెళ్లాయని గుడి పూజారులు తెలిపారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో వెలువడే సువాసనను పసిగట్టి ఆలయం వద్దకు ఆ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు వస్తుంటాయని వారు చెప్పారు. ఈ ఎలుగుబంట్లను అమ్మవారి భక్తులుగా స్థానికులు భావిస్తుంటారని తెలిపారు. ఇక్కడకు వచ్చే ఎలుగుబంట్లు ఎవరికీ హానీ తలపెట్టవని... స్థానికులు కూడా వాటిని సాదరంగా ఆహ్వానిస్తారని డీఎఫ్ఓ మహసముంద్ అన్నారు.

  • Loading...

More Telugu News