: విజయవాడలో ఫుడ్‌కోర్టు తొలగింపు యత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. ఏయూలో వర్సిటీల వీసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అయితే, అంతకు ముందు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులతో ఆయన మాట్లాడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును నిన్న అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో సదరు సిబ్బందికి, అక్కడి వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపైన అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఫుడ్‌కోర్టు తొలగింపు ప్రయత్నం ఎందుకు చేశారంటూ సంబంధిత అధికారులపై మండిపడిన ఆయన.. ప్రజలకు కలెక్టర్లు, అధికారులు సేవకులుగా వ్యవహరించాలని హితవు పలికారు.