: మరి కాసేపట్లో హిల్లరీ, ట్రంప్ రెండో డిబేట్.. మొదటి డిబేట్‌లో హిల్లరీదే పైచేయి


అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మరికాసేపట్లో రెండో డిబేట్ ప్రారంభం కానుంది. మొదటి డిబేట్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ పైచేయి సాధించిన నేపథ్యంలో రెండో డిబేట్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హిల్లరీ సీక్రెట్ ఈమెయిల్స్, మహిళలపై ట్రంప్ అసభ్యకర వ్యాఖ్యల టేపుల వ్యవహారంపై దుమారం రేగుతున్న సమయంలో జరగనున్న ఈ డిబేట్ ఆసక్తి రేపుతోంది. సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఈ డిబేట్ జరగనుంది. ఈ డిబేట్‌కు మోడరేటర్‌గా సీఎన్ఎన్ ప్రతినిధి ఆండ్రూసన్ కూపర్ వ్యవహరించనున్నారు. డిబేట్‌లో నిర్దిష్టమైన అంశం అంటూ ఏమీ లేదు. దీనిని రెండు భాగాలుగా విభజించారు. ఇది టౌన్‌హాల్ తరహాలో సాగనుంది. మొదటి భాగంలో ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు ట్రంప్, హిల్లరీలు సమాధానం చెబుతారు. తర్వాతి భాగంలో మోడరేటర్ ప్రశ్నలు సంధిస్తారు. సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్‌పై చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News