: ఆ సమయంలోనే ‘ప్రత్యూష’ సంస్థను స్థాపించాలనే ఆలోచన వచ్చింది: సమంత
గతంలో తాను అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే, తనకు సేవ చేయాలన్న ఆలోచన వచ్చుండేది కాదేమోనని దక్షిణాది హీరోయిన్ సమంత చెప్పింది. ఆ ఆలోచన కారణంగానే ‘ప్రత్యూష’ సంస్థను స్థాపించి, చిన్నారులకు వైద్యం చేయించగలిగే అవకాశం దొరికిందని చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో సమంత పలు విషయాలను ప్రస్తావించింది. తన జీవితం సాఫీగా సాగుతుండటానికి కారణం..తాను పడ్డ కష్టానికి అదృష్టం తోడవటమేనని చెప్పింది. నిత్యం దైవప్రార్థన చేస్తానని, అయితే, డబ్బు కావాలనో, సినిమా అవకాశాలు మరిన్ని రావాలనో కాదని, సమస్యలను తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటుంటానని సమంత చెప్పింది.