: రేపు దుర్గగుడి దర్శన వేళల్లో మార్పులు: ఈవో సూర్యకుమారి


రేపు దుర్గగుడి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో సూర్యకుమారి వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుందని చెప్పారు. భక్తులందరినీ సాధారణ క్యూ లైన్లలో మాత్రమే అనుమతిస్తామని అన్నారు. రూ.300, రూ.500 టికెట్లు రద్దు చేశామని, వారికి కూడా అంతరాలయ దర్శనం రద్దు చేేశామని చెప్పారు. అయితే, అత్యంత ప్రముఖులకు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. కాగా, రేపు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News