: కేంద్ర మంత్రివర్గం తీసుకున్న‌ కీలక నిర్ణయాలు ఇవిగో..!


ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో పాక్‌, భార‌త్ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌పై మాత్ర‌మే కాకుండా ప‌లు కీల‌క అంశాల‌పై కూడా చ‌ర్చించారు. పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. అవి.. * హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బిల్లు-2014 సవరణలకు కేబినెట్ పచ్చ‌జెండా ఊపింది. * జేఎస్‌సీ వాన్‌కోర్‌నెస్ట్‌ (ర‌ష్యా ఆయిల్‌ సంస్థ) నుంచి 11 శాతం వాటా కొనుగోలుకు ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌. * మెడ్‌ పార్క్‌కు తమిళనాడు, కాంచీపురం, చెంగళ్‌పట్టులో మొత్తం 330 ఎకరాల గ‌వ‌ర్న‌మెంట్‌ భూమి లీజుకు ఇచ్చేందుకు ఆమోదం. * హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌కు కూడా స‌ర్కారీ భూమిని లీజుకు ఇచ్చేందుకు అంగీకారం. * జల సహకారంపై భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ మధ్య జ‌రిగిన‌ ఒప్పందానికి కేంద్ర‌మంత్రివ‌ర్గం ఆమోదం.

  • Loading...

More Telugu News